తెలుగు కథలు


 కథ చెప్పమ్మా ప్లీజ్‌!

అంతర్జాలానికి అతుక్కుపోయే నేటి పిల్లలు కథలను వింటారా? ఒకవేళ వింటే ప్రయోజనమేంటి? తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాన్ని పదిలం చేసే శక్తి కథలకు ఉంది. పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయి, కొత్త ఆలోచనలకు పట్టం కడుతున్న పోటీప్రపంచంలో మన పిల్లలు నెగ్గుకురావాలంటే.. కథలు చాలా అవసరం. రోజుకొక కథ వింటే లాభమేంటి? 

ఓసారి చూద్దాం..

* కథ ఒక శక్తివంతమైన విజువల్‌ ఎఫెక్ట్‌. హ్యారీపోటర్‌, జంగిల్‌బుక్‌లను మించిన సినిమా దృశ్యాలకు కథారూపం ఇవ్వొచ్చు. కథలోని పాత్రలూ, వేషధారణా, ప్రదేశాలూ, వాతావరణంతో మమేకమై తమదైన లోకాన్ని సృష్టించుకుంటారు పిల్లలు. ఆ సన్నివేశాల్లో నుంచే సృజనాత్మకత  పుడుతుంది. 

* పదబంధాలూ, పలుకుబళ్లూ, సామెతలూ, వాక్పటిమ.. కథలు వింటే అలవోకగా అలవడతాయి. భాషా సామర్థ్యం పెరుగుతుంది. పిల్లల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు ఢోకా ఉండదు.

* ఒకప్పటిలా తరగతి గదిలో మన పిల్లాడి పక్కన.. అందరూ మన ఊరి పిల్లలే కూర్చోరు. భిన్న ప్రాంతాలూ, మతాలూ, సంస్కృతులకు చెందిన పిల్లలతో కలిసి చదువుకోవాల్సి వస్తుంది. పర భాషల కథలను పిల్లలకు చెప్పినప్పుడు.. ప్రపంచంలోని ఆ వైవిధ్యం పసితనంలోనే అర్థమవుతుంది. కొత్తవ్యక్తులతో కలిసిపోయే స్వభావం  అబ్బుతుంది. 

* పోటీ ప్రపంచంలో వేగం తప్పనిసరి. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడతానంటే కుదరదు. ఒక్కసారి చదివితే గుర్తుండిపోవాలి. సూక్ష్మగ్రాహకశక్తి ఉంటే అది సాధ్యం అవుతుంది. ఆ లక్షణం కథలను వినడం వల్ల వస్తుంది. 

* పరీక్షలంటే ఆందోళనా, మార్కులు తక్కువొస్తే కంగారు. ఆటల్లో ఓడిపోతే కన్నీళ్లు. కథల్లోనూ అడ్డంకులను అధిగమించిన ఇలాంటి ఎన్నో పాత్రలు తారసపడతాయి. అవి పిల్లల్లో స్ఫూర్తినింపి.. ఉత్తేజం కలిగిస్తాయి.

Comments

Popular posts from this blog

BarristerParvatheesam

Pottery Making

Moral story of the year