గోదారోళ్ల ఏటకారం
సేనా ఏళ్ళ క్రితం ... విదేశాల నుండి ఒక తెల్ల దొర భారతదేశం ...అందులోను మన గోదావరి జిల్లాకి వచ్చి ... అక్కడ గోదారొడైన ఒక టాక్సీ డ్రైవర్ ని గోదావరి జిల్లాలు మొత్తం తిప్పి చూయించేటట్టు మాట్టాడుకొని బయల్దేరాడాటండి ... మొదటగా మన డ్రైవర్ దొరవారిని మన ద్వారకా తిరుమల దేవస్థానం కి తీసుకెల్తే .. ఆ గుడి మొత్తం తిరిగి చూసాక ...ఈ గుడి మొత్తం కట్టనీకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటావ్ అని అడిగితే ..మన డ్రైవర్ ఏమో ఒక పదేళ్లు పట్టి ఉంటుందేమో సార్ అంటె ...దానికి దొర గారు ... అంత కాలం పట్టిందా ...మా దేశం లో అయితే ఐదేళ్లలో కట్టేసేవోరు తెలుసా ..మీరు బాగా ఎనకపడిపోయారని అంటూ గొప్పలు పోయాడటండి ..
.అక్కడ మొదలు ఏలూరు...తాడేపల్లి గూడెం ... తణుకు ... ఇలా ఏ వూరిలో ఏ గుడి, కట్టడం చూయించినా ... ఎంత కాలం లో కట్టేరు అని అడగటం ... మా దేశం లో అయితే సగం కాలం లో కట్టేసేవోరు అని పేలడం సేత్తన్నాడటండి ...
దీంతో కడుపు రగిలి పోతున్న మన డ్రెవర్ బాబు ... మన రోడ్ కం రైల్ బ్రిడ్జి దగ్గరికి వచ్చేదరికి ... బ్రిడ్జి ముందు కారు ఆపి దిగి సూత్తా ఉంటే ... ఎనకమాలే కారు దిగిన దొరగారు ... ఈ బ్రిడ్జి ఎంతకాలంలో కట్టేరో అని అడిగీసరికి ... మన డ్రైవర్ బాబు ...
అదే సూత్తన్నానండి ...నిన్న రేతిరి ఆ దరి నుంచి ఈ దరికి వచ్చేదానికి పంటు మీద కారు దాటిచ్ఛేనండి ... మరేటో ..మావోల్లు రాతిరి రాతిరికి కట్టేసినట్టున్నారు ఈ బ్రిడ్జీ అని చెప్పీదరికి ... దొర గారు సృహతప్పి పడిపోయేడంట ...
పాపం గోదారొళ్లతో ఎటకారం ఆడితే ఏటైతాదో తెలిసొచ్చింటాది ఎదవకి ..
Comments
Post a Comment