Ek mini katha


హైదరాబాద్ సిటీ లో పెద్ద పేరున్న బిసినెస్ మాన్ అయిన అప్పల నాయుడు కొడుకు విశాల్ 

ఒక బాగా పేరు  ఉన్న జోతిష్యుడు "గోపాల్ శాస్త్రి " గారి  దగ్గర జాతకం చెప్పించుకోవటం  కోసం వెళ్లారు   విశాల్ ఇంక  అతని తండ్రి ,

అయితే  ఆ జ్యోతిష్కుడు  విశాల్ వాళ్ళ తండ్రి కి 

" మీరు  సరిగ్గా   ౩౦ రోజులలో చనిపోతారు చనిపోతారు" అని చెప్తాడు 

ఆశ్చర్యంగా  కరెక్ట్ గా  ఆ  జ్యోతిష్కుడు   చెప్పిన తేదీ  రోజే విశాల్ తండ్రి చని పోవటం జరుగుతుంది 

తండ్రి  మరణం  విశాల్ ని చాల డిప్రెస్ చేస్తుంది... కానీ అతనికి  అర్ధం కానీ  విషయం ఏమిటంటే ఆ జ్యోతిష్కుడు   చెప్పిన డేట్  కె  ఎలా చనిపోయారా  అని ...

ఇదే విషయం విశాల్ ఫ్రెండ్ అయిన "పోలీస్ SI వేణు " కి ఫోన్ చేసి  వివరిస్తాడు విశాల్

" అంత కచ్చితంగా ఆ జ్యోతిష్కుడు  చేపి చెప్పిన  రోజే ఎలా చనిపోతారు రా ఎవరైనా  .... 

మన చావు మన చేతుల్లో ఉండదు కదా అది హత్యో లేక అతను సూసైడ్ అట్టెంప్ట్ చేస్తే తప్పితే ..." అన్నాడు విశాల్ 

ఇలా  ఆ రోజే తనను కలవటానికి వచ్చిన తన సైక్రియాట్రిస్టు ఫ్రెండ్ "సత్య " తో డిస్కస్ చేసాడు SI వేణు 

సత్య కి కూడా ఈ కేసు చాల ఇంటరెస్టింగ్ గా అనిపించింది

కానీ ఇది 'హత్య ' అయుండక పోవచ్చు అని వాదిస్తాడు సత్య 

"నాతో వస్తే  నీకే తెలుస్తుంది కదా "అంటాడు వేణు 

"సరే పద " అని ఇద్దరు కలిసి విశాల్ ఇంటికి వెళ్తాడు ...

"విశాల్ ఒక సారి ... మీ నాన్నగారి  రూమ్  మొత్తం  చుపిస్తావా మాకు " 

" సరే అలాగే పదండి" అంటూ విశాల్ వల్ల నాన్నగారి రూమ్ , వస్తువులు , పుస్తకాలు , ఇంట్లోని  మనుషులు అందరిని చూపిస్తాడు

" సరే విశాల్ ... ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్  కోసం ముందు నువ్వు  FIR ఇవ్వాలి  పోలీస్ స్టేషన్ లో .." అన్నాడు  వేణు 

" అలాగే " అంటూ ఎఫ్ ఐ ఆర్ ఇచ్చాడు విశాల్ ....

వేణు ఫింగర్ ప్రింట్స్ కలెక్షన్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూస్తూ .... అసలు ఈ కేసు లో ఎవరు ఎవరు ఇన్వొల్వె అయ్యున్నారు  అని ... ఆ డైరెక్షన్ లో ఇన్వెస్టిగేట్  చేస్తున్నాడు

కానీ సత్య మాత్రం వీటితో సంబంధం లేకుండా ...విశాల్ తండ్రి  గారి బంధువులు , మిత్రులు , ఇంకా క్లోజ్ కాంటాక్ట్స్    వివరాల గురించి అడిగి తెలుసుకున్నాడు.....అసలు అతని తండ్రి గత 3 నెలల ముందు  నుంచి ... ఏ ఏ మనీ ట్రాన్సక్షన్ చేసారు ... ఎవరైనా కొత్త వాళ్ళని కలిసారా... అని ఆరా తీసాడు ..

విశాల్‌తో జరిగిన ఈ సంభాషణలో, "జోతిష్యుడు గోపాల్ శాస్త్రి"  గురించిన  విషయాలు కొన్ని సత్య సేకరించాడు

SI వేణు ఈమధ్యలో   గోపాల్ శాస్త్రీని కూడా విచారణ కోసం రమ్మని కోరతాడు

ప్రజల మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నందున సత్య కి దీని గురించి భిన్నమైన అభిప్రాయం ఉంది 

***************

విశాల్ ఇంట్లో వాళ్ళందరిని ఒకరి తరువాత ఒకరిని  ప్రశ్నించిన తరువాత ఇది సహజ మరణమే ...అనే నిర్ణయానికి వస్తాడు ...చంపటానికి సంబందించిన వెపన్స్ లేవు , పాయిసన్ స్టెయిన్స్  లేవు, చంపటానికి కావాల్సిన మోటివ్ కూడా ఏమి ఎవరిదగ్గర కనపడదు

కానీ  సత్య మాత్రం వేణు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పాడు ...."

"నేను చెప్పేది జాగ్రత్త  గా విను వేణు   . .. మొదట  నేను చెప్పేది ... అంత నమ్మశక్యం  గా లేక పోవచ్చు ....కానీ నమ్మాలిసిన విషయం . ...

...ఇది సహజ మరణంమో లేదా హత్య కాదు, కానీ నెమ్మదిగా  మరణానికి దారి తీసిన  కుటుంబ సభ్యుల  ప్రవర్తన మాత్రమే అతనిని  చంపేసింది . ఇక్కడ ఎవరు క్రిమినల్ కాదు ... ఎవరు ఏయ్ క్రైమ్ చేయలేదు .... కేవలం అందరు నమ్మిన ఒక అప నమ్మకం ... వల్ల అందరు ఆ డైరెక్షన్  లో నే  వెళ్లారు ....అలాగే మాట్లాడారు ... అదే నమ్మారు .. వారు చేసే ప్రతి పని .. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ పోయింది .... .... అల  వాళ్ళ  నమ్మకమే ఆయనను  చంపేసింది." 

వేణు : " నువ్ చెప్పేది నమ్మలేక పోతున్నాను సత్య ... ఎవరు చంపక పోవటం ఏంటి ....అందరు  చంపటం ఏమిటి  నాకు ఏమి అర్థం కావటం లేదు "

సత్య :  " దీని వెనుక కారణం కేవలం మనస్తత్వశాస్త్రం మాత్రమే చెప్ప  గలదు .... మనిషి  ఏ విషయాన్నీ ఐతే గట్టిగ నమ్ముతాడో .... ఆ  విషయాన్నీ కోషెన్ చేయడు ... ఉదాహరణకి ( ఓకే బాల్ చూపిస్తూ ) ఈ రబ్బర్ బాల్ ని నువ్ పైకి వేస్తె ఏమవుతుంది  ...కిందకి వస్తుంది ...అదే విషయం మన నరలో జీర్ణించు  కొని ఉంది కాబట్టి మనం కొశ్చన్ చెయ్యము .. సో ఆ బాల్ తో ఆదుకుంటాం కూడా అలాగే  ఏదియైన విషయాన్నీ  మనం గట్టిగ నమ్మితే .... మన  ప్రవర్తన ఆ నమ్మకాన్ని నిజాన్ని చేయటానికి  ప్రయత్నిస్తుంది .....

ఇపుడు ఎలాగైతే ఒక పిల్లాడ్ని క్యాషుల్ గా బుక్  తీసి చదువు అంటే  చదివడు కానీ రేపు ఎక్సామ్  ఉంది చదవకపోతె  ఫెయిల్ అవుతావు అంటే చదువుతాడు .... ఫస్ట్ కేసు  లో చెప్పింది నమ్మలేదు సెకన్డ్ కాజల్ లో నమ్మాడు .... జరిగింది...సింపుల్ .... ఇది కూడా అలాగే  జరిగింది.. 

ఎవరో ఒకరు మరణ తేదీని చాలా కాలం ముందు ప్రకటించారు ఇంకా అది కూడా నమ్మకలిగే వారిద్వారా చెప్పించారు ... అందరు నమ్మారు 

ఇది ఖచ్చితంగా జరగబోతోందని మనము అనుకున్నపుడు మన  చర్యలన్నీ కూడా అనుకోకుండా ఆ దిశలో జరుగుతూ ఉంటాయి "

మరణించిన తేదీ ప్రకటించిన  తరువాత ... వాళ్ళు ఆ జోతిష్యుడు ని అంత ఎక్కువ నమ్ముతారు కాబట్టి  తెలియకుండానే కుటుంబ సభ్యులలో వాళ్ళు చేసే పనులలో కాస్త నిర్లక్ష్యం పెరిగింది  ఇంకా అతనికి మెడిసిన్ లో ఇస్తున్న విశాల్ భార్య పొరపాటున  ఒక మెడిసిన్ బదులు ఇంకో మెడిసిన్ ఇచ్చు ఉండవచ్చు.. లేదా  అయన కి షుగర్ ఉంది అని తెలిసినా కూడా ప్రసాదం అని స్వీట్ ఇచ్చి ఉండచ్చు షుగర్ అని మరిచిపోయి ...లేదా బీపీ  ఉన్నాకూడా ఆయిల్స్ అండ్ సాల్ట్స్ ఎక్కువ అయుండచ్చు .... ఐతే ఇదంతా వాళ్ళు తెలిసి చేసిన విషయలు కాదు ... వాళ్ళ నమ్మకమే వాళ్ళచేత  చేయించింది ...."

వేణు : " ఇదంతా సరే ఏది ఏమి జరిగిన .... అప్పల నాయుడు గారు  అంత కరెక్ట్ గ  ఆ డేట్ రోజే ఎలా చని పోయారు  అంటావ్ ?  ఇది కూడా సైకోలోజి ఏ నా ? "

సత్య :  " ఎస్ ఇది కూడా సైకోలోజి ఏ .... ఎలా అంటావా .... నీకు అలారం పెట్టి పడుకునే అలవాటు ఉండే ఉంటుంది కదా .... రోజు లాగా కాకుండ ఎపుడైనా చాల ఇంపార్టెంట్ డే అనుకో ...లాయిక్ ట్రైన్  ఎక్కాలో  , లేక జాబ్ జాయిన్ ఆవాల్లో , లేక మీటింగ్ అటెండ్ అవ్వాలో అనుకో .. లేక బంధువుల పెళ్ళికి వెళ్లాలో అనుకో ... ఆ రోజు నీకు అలారం మోగక ముందే  నిద్ర లేస్తావ్ ....

ఇది ఎలా జరిగింది ...

అంటే ఆ ముందు రోజ్ నువ్వు నీ బ్రెయిన్ ని ఫీడ్ చేస్తావ్ రేపు ఈ టైం కే లేవాలి ఈ టైం కి లేవాలి అని .... సో నీ బ్రెయిన్ ... నువ్ నిద్ర పోతున్నప్పుడు కూడా వర్క్ చేస్తూ  నిన్ను  కరెక్ట్ అదే టైం కి లేపుతుంది  .... అలాగే  అప్పల నాయుడు గారు కూడా తన బ్రెయిన్ ని అలా  ఆ డేట్ కి ఫిక్స్ అయ్యి పోయారు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి పోయారు

రేపు న లాస్ట్ డేట్  అని సో ....కరెక్ట్  ఆ టైం కే అతని ప్రాణం  గుండె  ఆగి  పోయినాయి ..."

వరుస సంఘటనలు జరిగిన తరువాత  అనుకోకుండా  విశాల్ తండ్రి అప్పల నాయుడు గారు  కూడా ఆ డేట్ ని అంత బాగా నమ్మారు కాబట్టి   

అలా  కాన్సెప్ట్  విన్నాక  ఎసై వేణు వేరే దారి  లేక ప్రత్యక్ష  సాక్షి లేక ... ఇది "నాచురల్ డెత్ "అని కంఫర్మ్ చేస్తూ కేసు  క్లోజ్ చేసారు .


Comments

Popular posts from this blog

BarristerParvatheesam

Pottery Making

Moral story of the year