Palle velugu bus
#ఎర్రబస్సు ... !!
ఓ ఎగేసుకొని వచ్చేత్తారు ఎర్రబస్సు ఎక్కేసి పల్లెటూళ్ళ నుండి అంటారు కొంత మంది 🙂
అవునండి మేము ఎర్రబస్సు ఎక్కివత్తాం ... ఎర్రోల లాగానే మీకు కనిపిస్తాం, ఏందుకంటే ...
మా పల్లేటూర్లో చాలా విశాలమైన ఇల్లులు చూసిన మాకు ఈ సిటీలో ఇలా ఇరుకు ఇరుగ్గా ఉన్న ఇల్లులు చూసే సరికి ఇందేటి ఇలా ఉన్నాయ్ అని తింగరి చూపులు చూస్తాంగా అందుకే ఎర్రోల్లం
పక్కోడిని ఎలా బుట్టలో పడేసి బురుడీ కొట్టిద్దామా అనుకోకుండా ... ఏలా ప్రేమతో దరికి చేర్చుకుందామా అనుకుంటాము కదండి అందుకే ఎర్రోల్లం
కొంత మందిలాగా ఫిజ్జాలు, బర్గర్ లు మాత్రమే తినే ఆహరం అని అనుకోకుండా ... అన్నం పరబ్రహ్మం అని భావించి పాడవుతున్న దాన్ని పడేయడానికి మనసురాక ' సద్దన్నం ' అని పేరు పేట్టి తింటాము కదండి అందుకే ఎర్రోల్లం
కాని ఒకటండి మీరు అంత చులకనగా చూసినా గాని మీరంటే ఎప్పుడూ ఇష్టమేనండి మాకు
పల్లెలే దేశానికి పూనాదులంటారండి ...అలాంటి వాటిని ఏంత ఎదిగినా తక్కువగా చూడకండి ఆయ్
అయినా గొప్పతనం ' ఎర్రబస్సు ' లోనో,,,, ఎయిర్ బస్సు లోనో లేదండి సాటి మనిషి మనసులో ఉండండి
ఆ మనసు మంచిదైతే ఎంత ఎర్రోల్లుగా కనిపించినా వాళ్ళు దేవుల్లే నండి
తక్కువ చేద్దాం అని కాదండి ... ఏమైనా తప్పుగా మాటాడుంటే క్షమించండి
ఇప్పుడు ఎర్రబస్సులు లేవు కానీ అదే ఊతపదంగా అంటారు కొంతమంది వారికోసం 😊
Comments
Post a Comment