SIR author Cotton musuem
సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం 1998 లో ధవళేశ్వరంలో నిర్మించబడింది.
ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక సివిల్ ఇంజనీరింగ్ మ్యూజియం.
కాటన్ మ్యుజియం కాటన్ ఆనకట్ట గురించిన చరిత్రను వివరిస్తుంది. కాటన్ గారు అప్పట్లో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు (రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు. ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులను ఉంచారు. ఆనకట్ట కట్టుటకు కాటన్ ఉపయోగించిన పద్ధతులు, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే చిత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి.
కాటన్ దొర మునిమనుమడు ఈ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు వ్రాసిన స్పందన చిత్రము ఉంది.
మ్యూజియం బయట అవరణలో గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించే నమూనాకలదు.
ఆంధ్రప్రదేశ్ నుండి విశిష్ట సందర్శకులతో పాటు, విద్యార్థులు వారి విద్యా పర్యటనల్లో భాగంగా సందర్శిస్తున్నారు.
ఇతర రాష్ట్రాలు మరియు ఇతర దేశాల సందర్శకులు మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు
Comments
Post a Comment