Posts

Showing posts from January, 2022

Moral story of the year

 ఓ అత్తకి👵🏻ముగ్గురు అల్లుళ్ళు...👨🏻👨🏻‍🦱🧔🏻 వాళ్ళలో ఏ అల్లుడు మంచోడో తెలుసుకోవాలి అనుకుంది...👵🏻 మొదటి రోజు పెద్ద అల్లుడును👨🏻తీసుకుని సముద్రంలోకి వెళ్ళింది...👣👣 అక్కడ అత్త సముద్రంలో పడిపోయింది...🌊👵🏻 పెద్ద అల్లుడు కాపాడతాడు...🕴🏻 అత్త👵🏻...నా అల్లుడు👨🏻 చాలా మంచి వాడు అని కార్ కొని ఇచ్చింది...🚗 రెండో రోజు...రెండో అల్లుడును👨🏻‍🦱అదే చోటుకు తీసుకెళ్ళి👣👣 మళ్లీ సముద్రంలో పడింది...🌊👵🏻 రెండో అల్లుడు👨🏻‍🦱కూడా కాపాడతాడు...🕴🏻 అత్త👵🏻...రెండో అల్లుడు👨🏻‍🦱కూడా మంచోడు అని బైక్ కొని ఇచ్చింది...🏍️ మూడో రోజు...మూడో అల్లుడిని🧔🏻తీసుకెళ్ళింది...👣👣 అత్త మళ్ళీ సముద్రంలో పడిపోయింది...🌊👵🏻 మూడో అల్లుడు🧔🏻బాగా ఆలోచించాడు...🧔🏻 మొదటి అల్లుడికి కార్ ఇచ్చింది...🚗 రెండో వాడికి బైక్ ఇచ్చింది...🏍️ ఇక మిగిలింది కేవలం సైకిల్ మాత్రమే...🚲 ఇప్పుడు అత్తను👵🏻రక్షిస్తే అదే ఇస్తుంది...🚲 అది నేను🧔🏻ఏం చేసుకుంటాను అని అత్తను సముద్రంలో వదిలేసాడు...🌊👵🏻 ఇంటికి వచ్చేసాడు...🧔🏻 ఆశ్చర్యం...🕴🏻 తర్వాత రోజు చూస్తే ఇంటి ముందు BMW🚘 కారు కానుకగా వచ్చింది...🧔🏻 ఎలా....??? . .. ... ...

ముచ్చట గొలిపే మృదువైన పాదం

Image
 ముచ్చట గొలిపే మృదువైన పాదం శంఖాకారం శుభప్రదం అలరించే పారాణి సోయగం జీరాడే పట్టుపావడా సువర్ణ వర్ణ అంచు సహజ అలంకారం మువ్వల పట్టీ సవ్వడి వీనులవిందైన సంగీతనాదం నఖ సిరి సైతం శోభాయమానం పద్మంలాంటి పాదద్వయం తమలపాకులాంటి నాజూకుదనం నయనమనోహరం! క్రిష్

గోదారోళ్ల ఏటకారం

Image
  సేనా ఏళ్ళ క్రితం ... విదేశాల నుండి ఒక తెల్ల దొర భారతదేశం ...అందులోను మన గోదావరి జిల్లాకి వచ్చి ... అక్కడ గోదారొడైన ఒక టాక్సీ డ్రైవర్ ని గోదావరి జిల్లాలు మొత్తం తిప్పి చూయించేటట్టు మాట్టాడుకొని బయల్దేరాడాటండి ... మొదటగా మన డ్రైవర్ దొరవారిని మన ద్వారకా తిరుమల దేవస్థానం కి తీసుకెల్తే .. ఆ గుడి మొత్తం తిరిగి చూసాక ...ఈ గుడి మొత్తం కట్టనీకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటావ్ అని అడిగితే ..మన డ్రైవర్ ఏమో ఒక పదేళ్లు పట్టి ఉంటుందేమో సార్ అంటె ...దానికి దొర గారు ... అంత కాలం పట్టిందా ...మా దేశం లో అయితే ఐదేళ్లలో కట్టేసేవోరు తెలుసా ..మీరు బాగా ఎనకపడిపోయారని అంటూ గొప్పలు పోయాడటండి .. .అక్కడ మొదలు ఏలూరు...తాడేపల్లి గూడెం ... తణుకు ... ఇలా ఏ వూరిలో ఏ గుడి, కట్టడం చూయించినా ... ఎంత కాలం లో కట్టేరు అని అడగటం ... మా దేశం లో అయితే సగం కాలం లో కట్టేసేవోరు అని పేలడం సేత్తన్నాడటండి ... దీంతో  కడుపు రగిలి పోతున్న మన డ్రెవర్ బాబు ... మన రోడ్ కం రైల్ బ్రిడ్జి దగ్గరికి వచ్చేదరికి ... బ్రిడ్జి ముందు కారు ఆపి దిగి  సూత్తా ఉంటే ... ఎనకమాలే కారు దిగిన దొరగారు ... ఈ బ్రిడ్జి ఎంతకాలంలో కట్టేరో అని అడిగీస...

Ek mini katha

హైదరాబాద్ సిటీ లో పెద్ద పేరున్న బిసినెస్ మాన్ అయిన అప్పల నాయుడు కొడుకు విశాల్  ఒక బాగా పేరు  ఉన్న జోతిష్యుడు "గోపాల్ శాస్త్రి " గారి  దగ్గర జాతకం చెప్పించుకోవటం  కోసం వెళ్లారు   విశాల్ ఇంక  అతని తండ్రి , అయితే  ఆ జ్యోతిష్కుడు  విశాల్ వాళ్ళ తండ్రి కి  " మీరు  సరిగ్గా   ౩౦ రోజులలో చనిపోతారు చనిపోతారు" అని చెప్తాడు  ఆశ్చర్యంగా  కరెక్ట్ గా  ఆ  జ్యోతిష్కుడు   చెప్పిన తేదీ  రోజే విశాల్ తండ్రి చని పోవటం జరుగుతుంది  తండ్రి  మరణం  విశాల్ ని చాల డిప్రెస్ చేస్తుంది... కానీ అతనికి  అర్ధం కానీ  విషయం ఏమిటంటే ఆ జ్యోతిష్కుడు   చెప్పిన డేట్  కె  ఎలా చనిపోయారా  అని ... ఇదే విషయం విశాల్ ఫ్రెండ్ అయిన "పోలీస్ SI వేణు " కి ఫోన్ చేసి  వివరిస్తాడు విశాల్ " అంత కచ్చితంగా ఆ జ్యోతిష్కుడు  చేపి చెప్పిన  రోజే ఎలా చనిపోతారు రా ఎవరైనా  ....  మన చావు మన చేతుల్లో ఉండదు కదా అది హత్యో లేక అతను సూసైడ్ అట్టెంప్ట్ చేస్తే తప్పితే ..." అన్నాడు విశాల్...

SIR author Cotton musuem

Image
 సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం 1998 లో  ధవళేశ్వరంలో నిర్మించబడింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక సివిల్ ఇంజనీరింగ్ మ్యూజియం. కాటన్ మ్యుజియం కాటన్ ఆనకట్ట గురించిన చరిత్రను వివరిస్తుంది. కాటన్ గారు అప్పట్లో  ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు (రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు. ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులను ఉంచారు. ఆనకట్ట కట్టుటకు కాటన్ ఉపయోగించిన పద్ధతులు, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే చిత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి.  కాటన్ దొర మునిమనుమడు ఈ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు వ్రాసిన స్పందన చిత్రము ఉంది.  మ్యూజియం బయట అవరణలో గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించే నమూనాకలదు. ఆంధ్రప్రదేశ్ నుండి విశిష్ట సందర్శకులతో పాటు, విద్యార్థులు వారి విద్యా పర్యటనల్లో భాగంగా సందర్శిస్తున్నారు.  ఇతర రాష్ట్రాలు మరియు ఇతర దేశాల సందర్శకులు మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు

Pottery Making

Image
మట్టి కుండ మహా అద్భుతం.   కుమ్మరులు సమీపంలోని చెరువు నుండి మెత్తని ఒండ్రుమట్టి సేకరించి తీసుకొచ్చి దానిని మరింత మెత్తగా చేసి అందులో ఉన్న రాళ్ళను, చెత్తను వేరుచేసి దానిని నీళ్ళతో కలిపి నాలుగైదు రోజులు మగ్గబెడతారు. ఆ తర్వాత నీళ్ళు పోసి కాళ్ళతో బాగా  తొక్కుతారు. ఈ మట్టిని కుమ్మరి చక్రంపై రెండడుగులు స్తూపాకారంగా పెట్టి చక్రాన్ని కట్టెతో తిప్పి కుండను తయారు చేస్తారు.    ఇవి పచ్చిగా సున్నితంగా వుంటాయి. వీటిని ఒకరోజు నీడలో ఆరబెట్టి ఆ తర్వాత కుండలోపల చేతిపెట్టి పైన కొట్టడంతో సాగి కింద వున్న రంధ్రం మూసుకుపోతుంది. తర్వాత నీడలో ఆరబెడతారు. కుమ్మరి వాము కుండలు కాల్చడానికి ఉపయోగించే బట్టి (పొయ్యి)లో ఒక రోజు కాల్చి, ఆ వాము చల్లారిన తరువాత తీసే విధానం కుండను తయారు చేసే విధానం  

తెలుగు కథలు

Image
 కథ చెప్పమ్మా ప్లీజ్‌! అంతర్జాలానికి అతుక్కుపోయే నేటి పిల్లలు కథలను వింటారా? ఒకవేళ వింటే ప్రయోజనమేంటి? తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాన్ని పదిలం చేసే శక్తి కథలకు ఉంది. పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయి, కొత్త ఆలోచనలకు పట్టం కడుతున్న పోటీప్రపంచంలో మన పిల్లలు నెగ్గుకురావాలంటే.. కథలు చాలా అవసరం. రోజుకొక కథ వింటే లాభమేంటి?  ఓసారి చూద్దాం.. * కథ ఒక శక్తివంతమైన విజువల్‌ ఎఫెక్ట్‌. హ్యారీపోటర్‌, జంగిల్‌బుక్‌లను మించిన సినిమా దృశ్యాలకు కథారూపం ఇవ్వొచ్చు. కథలోని పాత్రలూ, వేషధారణా, ప్రదేశాలూ, వాతావరణంతో మమేకమై తమదైన లోకాన్ని సృష్టించుకుంటారు పిల్లలు. ఆ సన్నివేశాల్లో నుంచే సృజనాత్మకత  పుడుతుంది.  * పదబంధాలూ, పలుకుబళ్లూ, సామెతలూ, వాక్పటిమ.. కథలు వింటే అలవోకగా అలవడతాయి. భాషా సామర్థ్యం పెరుగుతుంది. పిల్లల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు ఢోకా ఉండదు. * ఒకప్పటిలా తరగతి గదిలో మన పిల్లాడి పక్కన.. అందరూ మన ఊరి పిల్లలే కూర్చోరు. భిన్న ప్రాంతాలూ, మతాలూ, సంస్కృతులకు చెందిన పిల్లలతో కలిసి చదువుకోవాల్సి వస్తుంది. పర భాషల కథలను పిల్లలకు చెప్పినప్పుడు.. ప్రపంచంలోని ఆ వైవిధ్యం పసితనంలోనే అర్థమవుత...

Tea time

Image
  ఒకోసారి డబ్బు కానా  జ్ఞాపకాలకి విలువ ఎక్కువ ఉంటుంది....

Palle velugu bus

Image
 #ఎర్రబస్సు ... !! ఓ ఎగేసుకొని వచ్చేత్తారు ఎర్రబస్సు ఎక్కేసి పల్లెటూళ్ళ నుండి అంటారు కొంత మంది 🙂 అవునండి  మేము ఎర్రబస్సు ఎక్కివత్తాం ... ఎర్రోల లాగానే  మీకు కనిపిస్తాం, ఏందుకంటే ...  మా పల్లేటూర్లో చాలా విశాలమైన  ఇల్లులు చూసిన మాకు ఈ సిటీలో ఇలా ఇరుకు ఇరుగ్గా ఉన్న ఇల్లులు చూసే సరికి ఇందేటి ఇలా ఉన్నాయ్ అని తింగరి చూపులు చూస్తాంగా అందుకే ఎర్రోల్లం  పక్కోడిని ఎలా బుట్టలో పడేసి బురుడీ కొట్టిద్దామా అనుకోకుండా ... ఏలా ప్రేమతో దరికి చేర్చుకుందామా అనుకుంటాము కదండి అందుకే ఎర్రోల్లం కొంత మందిలాగా ఫిజ్జాలు, బర్గర్ లు మాత్రమే తినే ఆహరం అని అనుకోకుండా ... అన్నం పరబ్రహ్మం అని భావించి పాడవుతున్న దాన్ని పడేయడానికి మనసురాక ' సద్దన్నం ' అని పేరు పేట్టి తింటాము కదండి అందుకే ఎర్రోల్లం  కాని ఒకటండి మీరు అంత చులకనగా చూసినా గాని మీరంటే ఎప్పుడూ ఇష్టమేనండి మాకు  పల్లెలే దేశానికి పూనాదులంటారండి ...అలాంటి  వాటిని ఏంత ఎదిగినా తక్కువగా చూడకండి ఆయ్ అయినా గొప్పతనం ' ఎర్రబస్సు ' లోనో,,,, ఎయిర్ బస్సు లోనో లేదండి సాటి మనిషి మనసులో ఉండండి ఆ మనసు మంచిదైతే ఎంత ఎర్రోల్లుగా కనిపిం...

Che Guevara writings

Image
 https://drive.google.com/file/d/1OORoO-rCbLGBRePsOplog5n2dDQljkbk/view?usp=drivesdk Click above link to open

Telugu kavyam

Image
 తియ్యని కావ్యం.. కావాలి..!! ఏదో కవిత వాసన కమ్మగా వస్తుంది ఆ పుస్తకంలో పేజీలు దాటుకుంటూ గాలికి రెపరెపలాడి కండ్లు కనిపిస్తూ మనస్సు పుటలు ఆస్వాదన చేస్తుంది.. గూట్లో పుస్తకం గుప్పిట్లో చేరే రంగుల ముఖచిత్రం మురిపించే మునివేళ్ళు తాకుతూ ఉత్తేజం పొందే కన్నులు పసందైన విందుకు ఎదురు చూసే... నమిలే మనసుకు రుచికరం కప్పి చెప్పే కవిత్వం నారికేళ పాకంలా విమర్శకుల ప్రశంసలు పొందే విశ్లేషకులకు భావం ఊట బావిలా ద్రవించే... అక్షరాలతో అల్లిన పదబంధం చదివి మనసుకు నవరస బంధం అలతి పదాలు ప్రయోగం సంధించిన అలంకారం మోహనాస్త్రం... కళ్ళు అక్షరాలను తింటూ కదులుతున్నాయి పదం వాక్యం నములు కుంటూ పంటి కింద పడ్డ అక్షర ద్వయం చెరుకు ముక్కలా తీయటి అనుభూతి పంచే... పుస్తకములో కాగితాలు పరుగెత్తుతున్నాయి మనసు వేగంగా కదులుతుంది కళ్ళు దేనికో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి రసజ్ఞత గల వాక్యం కోసము.... సృష్టించిన వాక్యాలు కుప్పలు తెప్పలు అమృత వాక్యమే శాశ్వత కీర్తి పొత్తములో ఒక వాక్యము నిలిచిన ధన్యం రాసిన కవి జన్మకు అదే మహాభాగ్యం..
Image
 శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం - కోరుకొండ, తూర్పుగోదావరి జిల్లా.... ❤️ #రాజమండ్రికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో  615 మెట్లు ఉన్నటువంటి కొండపై స్వయంభూ స్వామి వారు వెలసిన దివ్యక్షేత్రం #కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం. ఇక్కడ ప్రత్యేకత  ఏంటంటే కొండ పై ఉన్న దేవాలయాన్ని చేరుకోవడానికి సుమారు 615 మెట్లు ఎక్కాలి ప్రతి మెట్టు లంబకోణ ఆకృతిలో ఉండటం వల్ల, కొండ  వాలు తక్కువగా ఉండటం వల్ల పైకి ఎక్కడం కొంచం కష్టతరమే ... ఈ ఆలయం ద్వాపర యుగం నాటిదని చరిత్ర మనకి చెబుతోంది. ప్రస్తుతం ఆలయ పాలన వ్యవహారాలను అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పర్యవేక్షిస్తుంది. ఈ కొండకు వేదాద్రి, పారిజాతగిరి, కోనగిరి అనే పేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రం క్రీ.శ 1303 నాటిదని అప్పటి శాసనాలలో స్పష్టంగా ఉంది. ధాన్యపు రాసి వలె ఉండటం వలన ఈ కొండకు కోరుకొండ అనే పేరు వచ్చిందని చెబుతారు. పరాశర మహర్షి తపస్సు వలన ఈ శిఖరానికి పరాశరశైలం అని పరాశరగిరి అని పేర్లు కూడా ఉన్నాయి. పరాశరమహర్షి తపస్సు కు మెచ్చి ఆయన కోరిక మేరకు స్వామి లక్ష్మీదేవి సమేతంగ శ్రీ లక్ష్మీ నరసింహునిగా ఇక్కడ వెలిసారు. కొండపైన స్వ...

Artos history

Image
  #ఆర్టోస్ చరిత్ర! తూర్పుగోదావరి జిల్లా #రామచంద్రపురానికి చెందిన #అడ్డూరి_రామచంద్రరాజు, #జగన్నాథరాజు అన్నదమ్ములు. 1911 లో రామచంద్ర రాజు రోడ్ కాంట్రాక్టర్ ఉద్యోగం చేసేవారు . రోడ్డు పనుల నిమిత్తం కాకినాడ లోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ పాడై ఉన్న సోడా మెషీన్ కనిపించింది. ఈ మెషీన్ అక్కడ పనిచేసిన బ్రిటిష్ అధికారి దాన్ని వదిలేసి వెళ్లినట్టు సిబ్బంది చెప్పారు. దానిలో నీళ్లు పోసి ఏదో తయారు చేసుకుని తాగేవారు అని అక్కడ సిబ్బంది చెప్పడంతో రామచంద్ర రాజు ఆ మెషీన్ కోరి, దానికి కొంత ధర చెల్లించి తన ఇంటికి తెచ్చుకున్నారు.1919లో #ఏ.ఆర్.రాజు అనే పేరుతో డ్రింక్స్ అమ్మారు. ఆ తర్వాత 1955లో ఆర్టోస్ గా పేరు మార్చారు. అప్పట్లో దీనినే ‘#రాజు_గారి_కలర్_కాయ్’ అని ప్రజలు పిలుచుకునే వారు. కానీ అప్పటికి భారతీయులకు సోడా కొత్త కావడంతో అంతగా ఆదరణ రాలేదు. సోడా సీసా చేసే శబ్దం, అందులో నుంచి వచ్చే పొగ ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు మాత్రం ఆర్టోస్ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. 

#నర్సాపురం - #రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు

Image
 # నర్సాపురం - #రాజమహేంద్రవరం ప్యాసింజర్ రైలు 😊 ఇందులో ప్రయాణిస్తే చాలు గోదావరి జిల్లాల అందాలు చూసేయొచ్చు భీమవరం, వీరవాసరం, పాలకొల్లు ఇంకా చాలా ఊర్లు ఉంటాయి 🥰🌴😍

గీతాంజలి

Image
 https://drive.google.com/file/d/1O5PzdT7_dxoS_00oDaNO10EC9aGA_efk/view?usp=drivesdk Click above link to open 

పుటుక్కు జరజర డుబుక్కు మేమే

Image
  మా బడిలో పిల్లలకు తెలుగు అంటే‌ చాలా ఇష్టం. రకరకాల పిట్టకథలు, పొడుపు కథలు, సామెతలు చెబుతూ, రాస్తూ ఉంటారు. ఒక రోజు మా బడిలో సునీల్ ఒక వాక్యం చెప్పి, దానిమీద ఒక కథ అల్లమన్నాడు. ఆ వాక్యం - “పుటుక్కు జరజర డుబుక్కు మేమే". మేమంతా చాలా ఆలోచించాం; కానీ కథ కుదరడం లేదు. అందరమూ ఆలోచిస్తూనే ఉన్నాము. ఇలా మూడు రోజులు గడిచింది. చివరికి మా అమ్మను అడిగితే, చిన్న లంకె అందించింది. దానితో నేను కథను ఇలా అల్లాను: మా ఇల్లు బోదగడ్డి కొట్టం. కొట్టం మీద నిండుగా గుమ్మడి తీగ అల్లుకుంది. దానికి ఒక లావుపాటి గుమ్మడికాయ కాసింది. కొట్టం చూరు కిందేమో, ఒక మేక కట్టేసి ఉంది. అంతలో మా పిల్లి కొట్టంమీదికి ఎక్కి, పైనున్న గుమ్మడి తీగను పుటుక్కున కొరికేసింది. అది కొట్టం మీద నుండి జర జరా జారి, కింద ఉన్న మేక మీద డుబుక్కున పడింది. అప్పుడు మేక మేమే అని అరిచింది. ఇలా కథను అల్లి సునీల్ కి చెప్పాను. సునీల్ కి తెలిసిందీ ఈ కథేనట! మా అమ్మ ఎంత తెలివైనదో చూడండి!!

ఉప్మా కనిపెట్టిన వాడ్ని ఉరికే వదలకూడదు

 ఉప్మా కనిపెట్టిన వాడ్ని ఉరికే వదలకూడదు😣...ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి ఉరితీయ్యాలి😂😂...ఎవరి ఇంటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో🐒🐒కసి తీర కడుపులో మంట చల్లార్చుకోడానికి చేస్తారో తెలీదు 😰😰..కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు🐺🐺... వుండండి వుండండి అంటూ😛😛 వంటింట్లో నుంచి ఏ పూరి నో పొంగలో తెస్తారనుకుంటే🙆.ఉట్టిపుణ్యం గా ఊడి పడుతుంది ప్లేట్ లో ఈ ఉప్మా🙇🙇.. ఒక రెండు స్పూన్ ల వరకు బాగానే వుంటుంది👸...తరువాత చూడండి జ్వరమొచ్చినప్పుడు మాత్రలు మింగినట్టు🙅🙅స్పూన్ స్పూన్ కి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్న మన కష్టాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా👶👶..ఇంకాస్త పెట్టమంటారా అంటే😳.... ఆ స్పూన్ తో తల మీద గట్టిగ కొట్టుకొని వెర్రి గా నవ్వాలనిపిస్తుంది💣💣💣...ఈ దరిద్రానికి మళ్లీ రకాలు💥💥..గోధుమ రవ్వ,,బొంబాయి రవ్వ అంటూ👂👂..బొంబాయి ముంబై అయినా..ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చెలామణి అవుతాంది😛😛...జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా🐇🐇...ఉల్లిపాయలేస్తే ఉల్లిపాయుప్మ🐓🐓..టమాట వేస్తే టమేటా బాత్ 🍅🍅🍅.... ఉప్మా చేయి అంటే చాలు చిటికెలో చేతిలో ఉప్మా ప్లేట్ తో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ...

గురువుకు పాఠం

Image
 

పంచతంత్రం

Image
  రాజధర్మం మామిడిపళ్ళు కావాలని మారాం చేసిన ధనగుప్తుని కొడుకుని వెంటబెట్టుకుని బయటికి వచ్చాడు ఇంద్రపాలితుడు. పిల్లాడికి పళ్ళు కొనిపెట్టలేదు సరికదా, పిల్లాణ్ణి దాచేసి, తిరిగొచ్చాడు. పిల్లాడేడి? అని అడిగిన ధనగుప్తునితో ఇలా చెప్పాడు ఇంద్రపాలితుడు.‘‘గెద్ద ఎత్తుకుపోయింది.’’ఆ మాటకి ఆశ్చర్యపోయాడు ధనగుప్తుడు. పిల్లాణ్ణి గెద్ద ఎత్తుకుపోవడమేమిటి? అని ఆలోచించాడు. అసంభవం అనిపించింది. అసాధ్యమనిపించింది. కోపం వచ్చిందతనికి. వెళ్ళి ఇంద్రపాలితుని పీక పట్టుకున్నాడు.‘‘నిజం చెప్పు? నా పిల్లాణ్ణి ఏం చేశావు?’’ అడిగాడు.‘‘నిజమే చెబుతున్నాను. నీ కొడుకుని గెద్ద ఎత్తుకుపోయింది.’’ గొంతు పెగల్చుకున్నాడు ఇంద్రపాలితుడు.‘‘లేదు, గెద్ద ఎత్తుకుపోలేదు. నువ్వే వాణ్ణేదో చేశావు. పిల్లాడి వంటి మీదున్న బంగారం కోసం వాణ్ణి పొట్టన పెట్టుకుని ఉంటావు. చంపేసి ఉంటావు. అవునా?’’‘‘లేదు, గెద్ద ఎత్తుకుపోయింది వాణ్ణి.’’‘‘నోర్ముయ్‌! అబద్ధాలాడకు. నీ చేత నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. పద’’ అంటూ ఇంద్రపాలితుణ్ణి నెట్టుకుంటూ న్యాయాధికారి దగ్గరకి వచ్చాడు ధనగుప్తుడు. జరిగిందంతా న్యాయాధికారికి చెప్పాడు. ‘‘పళ్ళు కొనిపెడతానని పిల్లాణ్ణి తీ...

నరకంలో హరిశ్చంద్రుడు.pdf

Image
  https://drive.google.com/file/d/1N2pdN5c8IsztddrTuchpBYuletid0Kod/view?usp=drivesdk      Click Above link to open file

పంచతంత్రం

Image
పావురం- డేగ వింధ్యపర్వతం మీది పక్షులు గురించి హిరణ్యగర్భుడికి చెబుతూ మంచి చెప్పినా, బుద్ధి చెప్పినా తెలివయిన వారికీ, మంచివారికే చెప్పాలన్నాడు దీర్ఘముఖుడు. తెలివి తక్కువ వారికీ, బుద్ధిహీనులకీ చెప్పకూడదన్నాడు. చెబితే కోతులకు నీతులు చెప్పిన కుందేలులా ప్రమాదంలో పడతాం అన్నాడు. ఆ కథ చెప్పాడు. విని నవ్వుకున్నాడు హిరణ్యగర్భుడు.‘‘అసలు విషయానికి రా’’ అన్నాడు.‘‘అక్కడికే వస్తున్నాను.’’ అన్నాడు దీర్ఘముఖుడు. చెప్పసాగాడిలా.‘‘ఆ పక్షులన్నీ మిమ్మల్నీ నన్నూ తిట్టి పోశాయని చెప్పాను కదా, తర్వాత ఏమన్నాయంటే ‘నీచుడా! మా దేశానికి వచ్చి మమ్మల్నీ, మా రాజునీ నిందిస్తావా? మీ రాజు గొప్పలూ, మీ దేశం గొప్పలూ గోరంతలు కొండంతలు చేసి చూపిస్తావా? మా రాజంటే ఏమనుకున్నావు? ప్రపంచం అంతా అతనికి జేజేలు కొడుతోంది. మీ రాజుకి మేఘం కనిపిస్తే చాలు, పారిపోతాడు. పిరికిసన్నాసి. మా రాజు అలాంటి వాడు కాదు. మీ రాజులాంటి వారు వెయ్యిమంది కూడా మా రాజుతో సరిరారు.’’‘‘బాగా బొప్పి కట్టించాయి.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.‘‘అనుమానమా! ఆఖరికి ఏమన్నాయో తెలుసా? నీ మాట మేము వినడం కాదు, నువ్వే మా మాట విను. నువ్వూ, మీ రాజూ మా రాజ్యానికి రండి. మా రాజాశ్రయాన్ని ...

నాణ్యం చెప్పిన నీతి కథ / Moral story

Image
 

Amaravathi kathalu

https://drive.google.com/file/d/1MDs9XSWq6sw7QFTDz6pvYmJOWTIe2fxk/view?usp=drivesdk   Amavarthi kathalu - telugu vari kathalu

ఇడ్లి- ఆర్కిడ్- ఆకాశం యండమూరి వీరంద్రనాథ్

Image
https://drive.google.com/file/d/1M1igi7Yl1FOQcXWEv_ynrL0IPJDRykl9/view?usp=drivesdk  

kasi majili kathalu

Image
https://drive.google.com/file/d/1QbRwyLkhBmh3w_9jr6hPX0E3iGWgEcGJ/view   click the above link to view the file

BarristerParvatheesam

Image
https://drive.google.com/file/d/1QbRwyLkhBmh3w_9jr6hPX0E3iGWgEcGJ/view  తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన మరపురాని హాస్య నవల ''బారిస్టర్‌ పార్వతీశం''. మొక్కపాటి నరసింహాశాస్త్రి గారు రాసిన ఈ నవల 90లో పదవతరగతి చదువుకున్న వారందరికీ గొప్ప అనుభూతితో కూడిన జ్ఞాపకం..  #BarristerParvatheesam

Gudisa HillStation ⛰️🌄🏍🏁

Image